- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
by Malleboina Mahesh |
కాళేశ్వరం నివేదిక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

X
దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం నివేదిక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో KCR, హరీష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ ను మరోసారి పిటిషన్ తరపు న్యాయవాదులు మెన్షన్ చేశారు. కాళేశ్వంపై ధర్యాప్తు చేయాలని ఘోష్ నివేదికను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేసీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అనంతరం ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారించాలని న్యాయవాదులు కోరారు. అయితే కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటిచింది.
Next Story






