- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలంపూర్ హస్పిటల్ ప్రారంభం ఎందుకు ఆలస్యం? : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ హస్పిటల్ లో మౌళిక సదూపాయాలు, సేవలు ఎందుకు ప్రారంభించలేదని రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ చౌరస్తాలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ హస్పిటల్ లో మౌళిక సదూపాయాలు, సేవలు ఎందుకు ప్రారంభించలేదని రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సామాజిక కార్యకర్త ఎస్. రామచంద్ర రెడ్డి వేసిన ప్రజాహిత వ్యాజ్యం ( పిల్ )పై శుక్రవారం హై కోర్టు విచారణ చేపట్టింది. రూ.21 కోట్ల వ్యయంతో రెండు సంవత్సరాల క్రితమే నిర్మాణం పూర్తై, 2023 అక్టోబరులో ప్రారంభించబడినా, ఇంకా సేవలు ప్రారంభించ లేదని పిల్ లో పేర్కోన్నారు. ఈ పిటిషన్ విచారణలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. జాతీయ రహదారి-44 వద్ద ఉన్న ఈ ప్రాంతం ప్రమాదాలకు గురయ్యే ప్రదేశంగా ఉందని , ప్రమాదాల తర్వాత "గోల్డెన్ అవర్" సమయంలో అత్యవసర చికిత్స అందించే ఉద్దేశంతో ఆసుపత్రిని నిర్మించారని పిటిషన్‌లో తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పలువురు బాధితులు కర్నూలు లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషన్ లో వెల్లడించారు. ప్రభుత్వం ప్రారంభించకపోవడం వల్ల అనేక మంది ప్రమాద బాధితులు ప్రాణాలు కొల్పోతున్నారని పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ మాల పరోపకారి, పల్లి వినోద్ రెడ్డి, నల్లపు మణిదీప్ హై కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు, ప్రభుత్వ చర్యలపై ప్రశ్నంచింది. సమాధానం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.
- Tags
- Highcourt






