- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీఏ సమాచారం నిర్లక్ష్యంపై ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు
కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హై కోర్టు ఉత్తర్వులు పాటించకపోతే జరిమానా విధిస్తామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది. మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు గురువారం నోటీసులు ఇచ్చింది. సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటకు చెందిన వడ్డం శ్యామ్ ఆర్టీఐ ధరఖాస్తుకు సమాచారం ఇవ్వకపోడంతో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం నవంబర్ 24 తేదీన సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని శ్యామ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. దీనిపై జనవరి 26న కౌంటర్ దాఖలు చేయాలని వారికి ఆదేశించింది.






