- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టు నోటీసులు.. అసలు విషయం ఇదే
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association)కు హైకోర్టు (High Court) ధర్మాసనం తాజాగా నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association)కు హైకోర్టు (High Court) ధర్మాసనం తాజాగా నోటీసులు జారీ చేసింది. పార్ట్‌టైం ఉద్యోగులు, సభ్యులతో అసోసియేషన్ కార్యాకలాపాలు కొనసాగించడాన్ని సవాలు చేస్తూ కబడ్డీ కోచ్ పవన్ కుమార్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై సోమవారం చీఫ్ జస్టిస్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (Justice Aparesh Kumar Singh), జస్టిస్ మొహియుద్దీన్ (Justice Mohiuddin)తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
అయితే, పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ అసోసియేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగులు, సభ్యులు ఉన్నారని కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ అసోసియేషన్‌లలో సభ్యులుగా ఉండటం వల్ల క్రీడాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని వాదించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యకలాపాలపై ఇప్పటికైనా ఎంక్వైరీ జరిపించాలని కోరారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తన వాదనలు వినిపిస్తూ అసోసియేషన్ల నిర్వహణలో ప్రభుత్వాల పాత్ర పరిమితమని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదలు విన్న కోర్టు నేషనల్ స్పోర్ట్స్ కోడ్-2011ను అమలు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.






