- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్.. ఐదుగురికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
ఖాజాగూడ భూముల వ్యవహారంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజధాని కాజాగూడాలో (Khajaguda lands) కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్ భూక్యా, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు (TG High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు సోహిణి బిల్డర్స్ తో పాటు మరో నలుగురికి నోటీసులు చారి చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఖాజాగూడలో రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారంటూ ఎమ్మెల్యేలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో హైడ్రాకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.






