- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP : రాజాసింగ్‌కు అధిష్టానం నోటీసులు..! అదే జరిగితే అందరి జాతకాలు బయట పెడతానంటూ మాస్ వార్నింగ్
ఇటీవల సొంత పార్టీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh)కు నోటీసులు(Notice) ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సిద్ధం అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల సొంత పార్టీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh)కు నోటీసులు(Notice) ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సిద్ధం అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) బీజేపీ-బీఆర్ఎస్(BJP-BRS) పొత్తు ఆరోపణలను సమర్థిస్తూ, మంచి ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీపై గత కొంతకాలంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతోందని, రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం ఈ మేరకు ఆదేశించినట్లు సమాచారం.
అయితే ఈ వార్తలపై స్పందించిన రాజాసింగ్.. తనకు నోటీసులు ఇస్తే అందరి జాతకాలు బయట పెడతానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరివల్ల పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజల ముందు ఉంచుతానని అన్నారు. నాకు నోటీసులు ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం అందిందని.. నోటీసులు కాదని, కావాలంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని పేర్కొన్నారు. అయితే రాజాసింగ్ గతంలో గోల్కొండ జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా టి. ఉమా మహేంద్ర నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎస్సీ లేదా బీసీ నాయకుడిని నియమించాలని, లేకపోతే పార్టీని వీడతానని హెచ్చరించారు.
అలాగే మార్చిలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని.. పార్టీలో ఒకే కులం ఆధిపత్యం ఉందని, అసమర్థ నాయకులను తొలగించాలని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత బీజేపీ-బీఆర్ఎస్ విలీనం గురించి చేసిన వ్యాఖ్యలను నిజమేనని, పెద్ద ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరతారని, గతంలో ఇలాంటి పొత్తుల వల్ల బీజేపీ నష్టపోయిందని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం రాజాసింగ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని, రాష్ట్ర నాయకత్వాన్ని నోటీసులు జారీ చేయమని ఆదేశించినట్లు తెలుస్తోంది.






