- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
TG Control room: సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్.. ఢిల్లీ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల వాతావరణం పెరుగుతోంది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రం హై అలర్ట్ (High alert in border states) ప్రకటించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాలలోని తెలంగాణ నివాసితుల కోసం (Delhi Telangana Bhavan) తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ (Control room) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న తెలంగాణ నివాసితులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా సేవలను నిర్ధారించడానికి కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని అధికారులు తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ నంబర్లు ల్యాండ్‌లైన్: 011-23380556, వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ - మొబైల్: 9871999044 , హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు - మొబైల్: 9971387500, జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ - మొబైల్: 9643723157, సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మొబైల్: 9949351270 నెంబర్లలో సంప్రదించవచ్చని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కమిషనర్ తెలిపారు.
ఏపీ భవన్లో కూడా..
అలాగే భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో (AP Bhavan in Delhi) ఢిల్లీలోని ఏపీ భవన్లో కూడా తాజాగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 011-23387089, 98719 99430, 98719 99053ను ప్రకటించారు. అదనపు సమాచారం, సహాయం కోసం డిప్యూటీ కమిషనర్ నంబర్ 98719 90081, లైజన్ ఆఫీసర్ నంబర్ 9818395787ను అందుబాటులోకి తెచ్చారు.