ఓఆర్ఆర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ టోల్ ప్లాజా(Ghatkesar Toll Plaza) దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్(Heavy Traffic Jam) ఏర్పడింది.

ఓఆర్ఆర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ టోల్ ప్లాజా(Ghatkesar Toll Plaza) దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్(Heavy Traffic Jam) ఏర్పడింది. వరంగల్ రజతోత్సవ సభకు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఓఆర్ఆర్‌(ORR)పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని.. క్రియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నేడు బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సభను గులాబీ పార్టీ అధినాయ‌క‌త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ప‌క్కా రాజ‌కీయ వ్యూహం, ప్రణాళిక‌తో పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నట్టు నేతలు చెబుతున్నారు. అయితే ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండ‌బోతోంది..? ఆయన ఏం మాట్లాడబోతున్నారు? పార్టీ నాయ‌కుల‌కు, శ్రేణుల‌కు ఎలాంటి సందేశం, దిశానిర్దేశం చేయనున్నారు? అనే దానిపై స‌ర్వత్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

Next Story