- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఈ జిల్లాలకు అతిభారీ వర్షసూచన
బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని, దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు (శుక్ర, శని) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా (Low Pressure) మారిందని, దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు (శుక్ర, శని) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Weather Center) తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రేపు (శనివారం) నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక రాబోయే 2 గంటల్లో నల్గొండ, యాదాద్రి -భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weatherman) అంచనా వేశారు. హైదరాబాద్‌లో (Hyderabad Weather) అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు.






