- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల మీదుగా ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి. ఈ ద్రోణుల ప్రభావంతో రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఒకటి మంగళవారం ఉదయం ఉత్తర కోస్తా ఒడిశా నుంచి తూర్పు తెలంగాణ వరకు, ఇంటీరియర్ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది కాకుండా, మరో ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం (తమిళనాడు తీరం)పై ఏర్పడిన చక్రవాత సుడిగుండం నుంచి కోస్తా కర్ణాటక వరకు కొనసాగుతోంది. ఈ ద్రోణి తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ రెండు ద్రోణుల కారణంగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ :
నేడు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్ లో 10 సెం.మీ ల వర్షం :
మంగళవారం వర్షం మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అధిక వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్ జిల్లా ముథోల్ లో 10 సెం.మీ, వరంగల్ జిల్లా ఖానాపూర్ లో 8 సెం.మీ, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో 8 సెం.మీ, నల్గొండ జిల్లా నిడమనూర్ లో 8 సెం.మీ, నిజామాబాద్ జిల్లా రాంజల్ లో 7 సెం.మీ, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 7 సెం.మీ, సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో 6 సెం.మీ, సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ లో 6 సెం.మీ, కుమురం భీం జిల్లా సిర్పూర్ లో 5 సెం.మీ, జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో 5 సెం.మీ, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 5 సెం.మీ, నారాయణ్ పేట్ జిల్లా మాగనూర్ లో 5 సెం.మీ, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట్ లో 5 సెం.మీ, హైదరాబాద్ జిల్లా బహదూర్ పురాలో 5.7 సెం.మీ, బండ్లగూడలో 5 సెం.మీ, యాదాద్రి భువనగిరి రామన్నపేట్ లో 5 సెం.మీ, హైదరాబాద్ జిల్లా నాంపల్లిలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.






