నగర ప్రజలకు అలర్ట్.. దంచికొడుతున్న భారీ వర్షం

by Malleboina Mahesh |

హైదరాబాద్ నగరం వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 10 గంటలకు భారీ వర్షం ప్రారంభం అయింది. దీంతో ఒక్కసారిగా వరద చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

నగర ప్రజలకు అలర్ట్.. దంచికొడుతున్న భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం (heavy rain) కురుస్తుంది. ఉదయం నుంచి పొడి వాతావరణం కనబడగా.. సాయంత్రం తర్వాత దట్టమైన మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. దీంతో రాత్రి 10 గంటలకు నగర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం ప్రారంభం అయింది. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్‌పల్లి, గాజులరామారం, నేరేడ్‌మెట్, దమ్మాయిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, ఉప్పల్, నాగోల్, బోడుప్పల్, శ్రీనగర్ కాలనీ, మియాపూర్ కొండాపూర్, మదనపల్లి లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో క్షణాల వ్యవధిలోనే వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి కారణంగా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

Next Story