Telangana rains: తెలంగాణకు అలర్ట్.. మరో 2గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం

by Ajay Maddhiboyina |

తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మూడు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Telangana rains: తెలంగాణకు అలర్ట్.. మరో 2గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మూడు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కరీంనగర్, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో రెండు గంటలపాటు తేలిక‌పాటి వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే ఈ రోజు పొడివాతావ‌ర‌ణం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే మ‌రో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈనెల 26, 27 తేదీల‌తో పాటు 28వ తేదీ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

Next Story