రెయిన్ అలర్ట్.. మరో 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో నేడు పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా రాబోయే 2 గంటల్లో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.

రెయిన్ అలర్ట్.. మరో 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో నేడు పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా రాబోయే 2 గంటల్లో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదగిరి భువనగిరి, హన్మకొండ, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగార్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో చిరుజల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Next Story