ఈశాన్య తూర్పు తెలంగాణలో దంచికొడుతున్న వర్షం.. 207 మి.మీ వర్షపాతం నమోదు

by Malleboina Mahesh |

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.

ఈశాన్య తూర్పు తెలంగాణలో దంచికొడుతున్న వర్షం.. 207 మి.మీ వర్షపాతం నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం (Surface trough, low pressure) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ (Alert issued to districts) చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున ఈశాన్య, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి లో భారీ వర్షాలు కురిశాయి. అలాగే మంచిర్యాలలోని భీమిని, కన్నెపల్లిలో అత్యధికంగా 207 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వచ్చే రెండు గంటల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా చేసింది. రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ప్రాంతాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు

Next Story