- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో భారీ వర్షం..ఈ ప్రాంతాల వారికిి అలర్ట్
హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. కేపీహెచ్బీ, గాజుల రామారం, మహదేవపురం, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. కేపీహెచ్బీ, గాజుల రామారం, మహదేవపురం, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు మియాపూర్, పటాన్ చెరు, అల్వాల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖైరతాబాద్, అమీర్ పేట్, బేగంపేట, ఉప్పల్ ప్రాంతాల్లోనూ కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా మూడు గంటల పాటు వర్షం కురుస్తుందని పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదిలా ఉంటే రెండు మూడు రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం, మంగళవారం నగరంలో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి దాదాపు 3గంటల పాటు వర్షం కురిసింది. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.






