అలర్ట్.. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు

by velandi.Saikiran |

అలర్ట్.. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు ప‌డ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

అలర్ట్.. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు, బయట అడుగు పెట్టలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. సాయంత్రం ఐదు అయినా కూడా వాతావరణం చల్లబడడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ చల్లటి కబురు అందింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.

ఇవాళ ఉత్తర కోస్తా, రాయలసీమలో గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో పాటు భారీ వర్షం పడనుంది. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు పేర్కొందివాతావ‌ర‌ణ శాఖ‌. ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు తెలిపింది. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది.

Next Story