హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం

by Disha Web Desk 2 |
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నం, నాంపల్లి, కోఠి, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్, ఎంజే మార్కెట్, రామంతపూర్, ఉప్పల్, నల్లకుంట, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ పరిసరాల్లో కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరపిలేని వర్షంతో ఉదయంపూట పనులకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : తుఫాన్ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Next Story

Most Viewed