- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో జోరు వర్షం.. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా
by Kema Shiva Kumar |
చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా (HYDRAA) నగరంలోని బాగ్ అంబర్‌పేట్‌లోని బతకమ్మ కుంటకు జీవం పోసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా (HYDRAA) నగరంలోని బాగ్ అంబర్‌పేట్‌లోని బతకమ్మ కుంటకు జీవం పోసింది. కబ్జా కోరాల్లో చిక్కుకుని కుచించుకుపోయి, రూపు రేఖలను కోల్పోయిన బతుకమ్మ కుంట (Bathukamma Kunta)కు రేవంత్ సర్కార్ రూ.7.4 కోట్ల నిధులు కేటాయించి పూర్వ వైభవం తీసుకొచ్చింది. అయితే, అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న బతుకమ్మ కుంటను ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ కార్యక్రమానికి ఈ నెల 28కి (ఆదివారానికి) వాయిదా వేస్తున్నట్లుగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు.
Next Story






