- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు
by samatah |
తెలంగాణకు భారీ వర్ష సూచన. రాష్ట్రంపై భానుడు భగ భగలు కురిపిస్తుంటే,మరోవైపు వరణుడు కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణకు భారీ వర్ష సూచన. రాష్ట్రంపై భానుడు భగ భగలు కురిపిస్తుంటే,మరోవైపు వరణుడు కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. పంట చేతికందే సమయంలో భారీ వర్షాలతో రైతన్నలు అయోమయంలో పడిపోయారు. ఈ క్రమంలో వారికి మరో షాకింగ్ న్యూస్ తగలనుంది.
రాష్ట్రంలో నేడు, రేపు, శుక్ర,శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.శుక్రవారం రోజున, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో.. శనివారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story






