భాగ్యనగరంలో భారీ వర్షపాతం నమోదు.. ఈ ఏడాదిలోనే హయ్యెస్ట్ రికార్డు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-04 16:43:40  IST  )

సోమవారం (ఆగస్టు 4) సాయంత్రం భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. ప్రధాన రహదారులు జలమయమవ్వగా.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది.

భాగ్యనగరంలో భారీ వర్షపాతం నమోదు.. ఈ ఏడాదిలోనే హయ్యెస్ట్ రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం (ఆగస్టు 4) సాయంత్రం భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. ప్రధాన రహదారులు జలమయమవ్వగా.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. షరా మామూలుగా భారీ వర్షానికి నగరంలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వరకు, లక్డీకాపూల్‌ నుంచి అమీర్‌పేట్‌ వరకు, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు, ఐకియా నుంచి జేఎన్‌టీయూ వరకు, మెహిదీపట్నం నుంచి లక్డీకాపూల్‌ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రెండు గంటల వరకూ ఇళ్లలో ఉన్నవారు బయటకు రావొద్దని నగరవాసులకు మెసేజ్ ల రూపంలో విజ్ఞప్తి చేసింది.

కాగా.. రెండుగంటల్లో నగరంలో కురిసిన వర్షం.. ఈ ఏడాదిలోనే హయ్యెస్ట్ రికార్డుగా నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. షేక్ పేట్ లో 12.4, బంజారాహిల్స్ 12.5 సెంటీమీటర్లు, యూసుఫ్ గూడలో 11.7, శ్రీనగర్ కాలనీ- 10.6, కూకట్ పల్లిలో 10 సెంటీమీటర్లు, మైత్రీవనంలో 9.2, మూసాపేటలో 7.9, జూబ్లీహిల్స్ లో 7.4, మెహదీపట్నంలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

Next Story