అలర్ట్... హైదరాబాద్ లో రానున్న రెండు గంటల్లో భారీ భారీ వర్షం!

by velandi.Saikiran |

హైదరాబాద్ (Hyderabad) నగర ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తాజాగా

అలర్ట్... హైదరాబాద్ లో రానున్న రెండు గంటల్లో భారీ భారీ వర్షం!
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) నగర ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు గంటల్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో వర్షం (Rain) పడే అవకాశాలు ఉన్నట్లు.. సూచనలు చేసింది వాతావరణ శాఖ.

హైదరాబాద్ పరిధిలో ఉన్న బీరంగూడ, ఆర్సిపురం, శేరిలింగంపల్లి , మియాపూర్, చంద్రాయన గుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, బాలాపూర్ శంషాబాద్ రాజేంద్రనగర్ హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో... భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.

ఇక మిగిలిన హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చెదురు మదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత... ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు.. ఇటు జిహెచ్ఎంసి కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC). బయటకు ఎవరు రాకూడదని కూడా హెచ్చరించింది.

Next Story