తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 2గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం

by Ajay Maddhiboyina |

తెలంగాణలోని పలు జిల్లాలో రాబోయే 2గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల‌తో పాటు న‌ల్గొండ‌, సూర్యాపేట‌, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ములుగు, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వ‌ర్షాలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 2గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాలో రాబోయే 2గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల‌తో పాటు న‌ల్గొండ‌, సూర్యాపేట‌, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ములుగు, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

అల్ప‌పీడ‌నం కార‌ణంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో రాత్రంతా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. అదే విధంగా హైద‌రాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి నుండి మ‌ధ్య‌స్థంగా కురిసే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేశారు. ఇక గ‌త కొద్దిరోజులుగా తెలంగాణ‌లో వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రంలోని ప‌లు జ‌లాశ‌యాలు నిండిపోయాయి. న‌దులు సైతం ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి.

Next Story