తెలంగాణకు భారీ వర్షసూచన..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తెలంగాణకు భారీ వర్షసూచన..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మధ్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ ఘడ్, ధక్షిణ జార్ఖండ్ లలో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ఫలితంగా తెలంగాణలో అనేక జిల్లాలలో రానున్న రెండు రోజుల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్ , కుమరం భీం అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల సహా వివిధ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం నిజామాబాద్ జిల్లా నవీపేట్ లో 4 సెం.మీ, జగిత్యా ల జిల్లా మల్లాపూర్ లో 3 సెం.మీ, నిజమాబాద్ జిల్లా ఎడపల్లి లో 2 సెం.మీ, రంజల్ లో 2 సెం.మీ, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో 2 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story