- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ వాసులకు అలర్ట్..ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
by Ajay Maddhiboyina |
రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ బాలాజీ ప్రకటించారు. టోలి చౌకి, షెయిక్‌పేట్, మెహదీపట్నం, లంగర్ హౌస్, అత్తాపూర్,

X
దిశ, వెబ్ డెస్క్: రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ బాలాజీ ప్రకటించారు. టోలి చౌకి, షెయిక్‌పేట్, మెహదీపట్నం, లంగర్ హౌస్, అత్తాపూర్, ఉప్పరపల్లి, నార్సింగి, జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొన్నాడు. కాబట్టి అలర్ట్‌గా ఉండాలని బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ రోజు రాత్రి నుండి రేపు ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపాడు. ఇదిలా ఉంటే నిన్న కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది.
Next Story






