- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముసీలోకి భారీగా వరద ప్రవాహం..మూసారాంబాగ్ బ్రిడ్జి మరోసారి క్లోజ్
by Ajay Maddhiboyina |
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నేడు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం పోటెత్తడంతో మరోసారి మూసీ ఉగ్రరూపం దాల్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నేడు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం పోటెత్తడంతో మరోసారి మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు ఆరు గేట్లను నాలుగు అడుగుల మేర పైకి ఎత్తి మూసీ నదిలోకి నీటిని వదిలారు. ఇప్పటికే మూసీలో వరద నీరు ఎక్కువ ప్రవహిస్తుంగా గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి మరింత పెరిగింది. ప్రవాహం పెరగటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు మూసారాంబాగ్ వద్ద మూసీలో దాదాపు 8వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండటంతో మూసారాంబాగ్ బ్రిడ్జిని మరోసారి మూసీ వేశారు. బ్రిడ్జిపై రాకపోకలను నిలివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.
Next Story






