Padi Koushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పై ముగిసిన విచారణ

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Koushik Reddy) పిటిషన్ పై నేడు హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది.

Padi Koushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పై ముగిసిన విచారణ
X

దిశ , వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Koushik Reddy) పిటిషన్ పై నేడు హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు జరిగిన విచారణలో.. క్వారీ యజమాని వ్యవహారంలో సుబేదారీ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఈనెల 16న పిటిషన్ దాఖలు చేశారు. 17న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విచారణను నేటికి(జూన్ 24) వాయిదా వేసింది. ఈలోపే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్ట్ రిమాండ్ ను తిరస్కరిస్తూ.. బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా ఈ పిటిషన్ పై విచారణ నేడు ముగిసింది.

Next Story