కోర్సు హోమియోపతి.. వైద్యం అల్లోపతి

by Disha Web |
కోర్సు హోమియోపతి.. వైద్యం అల్లోపతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హోమియోపతి కోర్సులు చేసి చాలా మంది అల్లోపతి వైద్యం అందిస్తున్నారని, దీనిపై టీఎస్ ​మెడికల్​కౌన్సిల్​ ఫోకస్​ పెట్టాల్సిన అవసరం ఉన్నదని హెల్త్​ కేర్​ రిఫామ్స్​ డాక్టర్స్​అసోసియేషన్ కోరింది. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న అనర్హ వైద్యులను చికిత్స అందించేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని శనివారం టీఎస్ మెడికల్​ కౌన్సిల్​కు హెచ్​ఆర్​డీఏ ఫిర్యాదు చేసింది.

ఏవీఎస్ ​పారామెడికల్​ ఇనిస్టిట్యూట్​, సాధు హాస్పిటల్స్​లో హోమియోపతి వైద్యం అందించాల్సి ఉండగా.. అల్లోపతి వైద్యాన్ని అందిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని కంప్లైంట్​లో పేర్కొన్నారు. నిజామాబాద్, నిర్మల్​, వరంగల్, హైదరాబాద్​ ప్రాంతాలలో ఆయా సంస్థలకు ప్రత్యేక బ్రాంచ్​లు ఉన్నాయని, వాటిపై కూడా ఎంక్వైరీ చేసి క్రిమినల్​ చర్యలు తీసుకోవాలని డా.మహేష్ ​ప్రభుత్వాన్ని కోరారు.Next Story