- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కాంగ్రెస్‌లో కేసీఆర్‌కు ఆయన పెద్ద కోవర్టు’:BJP
తెలంగాణ ఉద్యమనేతగా ఎంపీ ఈటల రాజేందర్ కు ఉన్న రాజకీయ ప్రతిష్టాను దెబ్బతీసేందుకు టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ తనదైన కట్టుకధలతో కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు విరుచుకపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమనేతగా ఎంపీ ఈటల రాజేందర్ కు ఉన్న రాజకీయ ప్రతిష్టాను దెబ్బతీసేందుకు టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ తనదైన కట్టుకధలతో కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు విరుచుకపడ్డారు. ఆదివారం ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పవార్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో ఎంపీ ఈటల శామీర్ పేటలో ఓ ఫామ్ హౌజులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో సమావేశమై, అక్కడి నుంచి మాజీ సీఎం కేసిఆర్ తో ఫోనులో మాట్లాడినట్ల టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వారిద్దరు సమావేశానికి సంబంధించిన ఆధారాలు 24 గంటల్లోగా బయటపెట్టాలి.
లేదంటే అదంతా కట్టుకథే అని అంగీకరించి తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. ఇలాంటి ఇమేజ్ ఉన్న లీడరు తమ పార్టీలో లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. కాంగ్రెసులో కేసిఆర్ కు అనుకూలంగా కోవర్టు రాజకీయాలు మహేష్‌గౌడ్ చేస్తున్నారనే సంగతి అందరికి తెలుసన్నారు. నిజామాబాదుకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ 2014 లోకసభ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్ధి కవితకు పరోక్ష మద్దతు ఇచ్చారని ఆరోపించారు. బిజెపిలో బీఆర్ఎస్ విలీనంపై కసరత్తు జరిగిందంటూ కవిత నిరాధార వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆ అంశంపై బిజెపిని విమర్శించాలంటూ ఇచ్చిన సూచన మేరకు మహేష్ కుమార్ గౌడ్ కుట్ర పూరితంగా ఈటలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.






