- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరారిలోనే హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. నిందితుల కస్టడీ విచారణ ముగియడంతో మంగళవారం వారికి వైద్య పరీక్షలను నిర్వహించి.. మల్కజ్‌గిరి కోర్టులో ప్రవేశ పెట్టింది. అనంతరం హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస రావు, సీఈవో సునీల్, శ్రీచక్ర క్లబ్ సెక్రటరీ రాజేందర్లను చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. మహిళ నిందితురాలిగా ఉన్న శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవితను చంఛల్‌గూడ మహిళ జైలుకు తరలించారు. ఈ కేసులో పరారీలో ఏ2 నిందితుడిగా ఉన్న హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌ను పట్టుకునేందుకు సీఐడీ చర్యలు చేపట్టింది. దేవరాజ్ పాస్ పోర్ట్ సీజ్ చేస్తున్నట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.
ఇక గత ఆరు రోజుల విచారణలో సీఐడీ హెచ్‌సీఏ అక్రమాలపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. బీసీసీఐ నిధుల దుర్వినియోగం పై కూడా కీలక అంశాలను స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. విచారణ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడిస్తామని ఏడీజీపీ సీఐడీ చారుసిన్హా తెలిపారు. ఇప్పటికే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ ఎన్నిక పై జరిగిన అక్రమాల పై సీఐడీ కీలక నివేదిక ప్రభుత్వానికి సమర్పించనుంది. మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.






