- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీష్ రావు లేఖ
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీష్ రావు లేఖ రాశారు.

రైతు డిస్కం లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించండి
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీష్ రావు లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో : రైతు డిస్కం లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన వెనుక విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రైతు డిస్కంపై ప్రజాభిప్రాయం తీసుకోకుండా, అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాలుగానీ, ప్రజాప్రతినిధులుగానీ ఎవరూ అడగలేదన్నారు. 29 లక్షల మంది వ్యవసాయ వినియోగదారుల కోసం కేవలం 2 వేల మంది సిబ్బందిని కేటాయించడం దారుణమని పేర్కొన్నారు. సిబ్బంది కొరత, సమన్వయ లోపంతో క్షేత్రస్థాయిలో విద్యుత్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆదాయ వనరులు చూపకుండా, రూ. 35 వేల కోట్ల బకాయిల వసూలు బాధ్యత కొత్త డిస్కంకు అప్పగించడం ఏంటి? అని ప్రశ్నించారు. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం 30 లక్షల మంది రైతుల అనుమతి లేకుండా కొత్త డిస్కంలోకి మార్చడం చట్టవిరుద్ధం అని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం..
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అధ్యక్షతన ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు, ఇంఛార్జ్‌లు, సమన్వయకర్తలతో తెలంగాణ భవన్‌లో సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరీష్ రావు పార్టీ నాయకులకు సభ్యత్వ నమోదు గురించి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈసారి సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50 రుసుముగా నిర్ణయించినట్లు హరీష్ రావు తెలిపారు.






