- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: జైలు గోడల మీద బొగ్గుముక్కతో ఆయన రాసిన రాతలు అజరామరం
తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల(Daasarathi Krishnamacharyulu) శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) స్మరించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల(Daasarathi Krishnamacharyulu) శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి.. నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన దాశరథి గొప్ప కవి అని కొనియాడారు. ‘‘తెలంగాణ విప్లవ శరధిలో ఎగిసిపడిన కవిత్వ తరంగం, ధిక్కార శతఘ్ని దాశరథి కృష్ణమాచార్యలు. ఆయన శత జయంతి సందర్భంగా ఘన నివాళి. సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాశరథి జైలు గోడల మీద బొగ్గుముక్కతో రాసిన ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అజరామరమై నేటికీ స్ఫూర్తినందిస్తున్నది. మహోన్నతమైన దాశరథి స్ఫూర్తి కొనసాగే దిశగా, వారి జయంతి రోజున ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను తొలి సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్యస్ఫూర్తిదాయకం’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. 1925 జులై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరులో వెంకటమ్మ, వేంకటాచార్యులకు దాశరథి జన్మించారు. హైదరాబాదు సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నారు. 1987 నవంబర్ 5న దాశరథి కన్నుమూశారు. బతికింది 62 ఏళ్లే అయినా.. తెలంగాణ ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించారు.






