ఆరు గ్యారంటీలకు గోరీ కట్టారు.. బడ్జెట్‍పై హరీశ్ రావు సెటైర్లు

by Prasad Jukanti |

కాంగ్రెస్ ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు చోర్ విధానం అని హరీశ్ రావు విమర్శించారు.

ఆరు గ్యారంటీలకు గోరీ కట్టారు.. బడ్జెట్‍పై హరీశ్ రావు సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బడ్జెట్ ద్వారా ఆరు గ్యారంటీలకు గోరి కట్టారని , ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పై ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరుతో పథకాలు ఉన్నా నిధులు మాత్రం కేటాయింపు లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్ ను చూస్తుంటే భట్టి (Bhatti Vikramarka) బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందన్నారు. గతంలో నిధులు ఖర్చు చేయని పథకాలకు మళ్లీ నిధులు కేటాయించారని మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా అని ప్రశ్నించారు.

సకల జనులకు దక్కింది గుండు సున్నానే:

పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని ఈ బడ్జెట్‍లో సకల జనులకు దక్కింది గుండు సున్నా మాత్రమేనన్నారు. ఈ ప్రభుత్వం మూడేళ్లు కూడా నిండకముందే రూ. 3 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1శాతం తలసరి ఉంటే మీ పాలనలో అది 10.2 శాతం ఉందని ఇది కాంగ్రెస్ పరిపాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చొబెట్టుకుని భట్టి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రంతో మూడుముక్కలాట:

రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి పడిపోయిందన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో, హైదారాబాద్ ను మూడు ముక్కలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని ఇది క్యూర్ మోడల్ కాదు చోరీ మోడల్ అని ఎద్దేవా చేశారు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణాలపైలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మినందుకు

Next Story