- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: దానికి బాధ్యత వహించాల్సింది రేవంత్ రెడ్డే
తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషాదం మరోసారి రైతు దుర్మరణంతో రుజువు చేసిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషాదం మరోసారి రైతు దుర్మరణంతో రుజువు చేసిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అప్పుల బాధతో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో రవినాయక్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలిచివేసిందని పేర్కొన్నారు. అటు వైద్య సేవలందించడంలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు చూపిన నిర్లక్ష్య వైఖరి రైతు మరణానికి కారణమని తెలిపారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆవేదనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రాథమిక వైద్య సేవలు అందించడంలోనూ విఫలం అవుతున్నదని పేర్కొన్నారు. ఇది కేవలం ఆసుపత్రుల నిర్లక్ష్యం కాదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు. రైతులను నిరాశలోకి నెట్టి, ఇటు జీవితంలో అటు మరణంలోనూ వారికి గౌరవం లేకుండా చేసినందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.






