అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి..? ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీశ్‌రావు కీలక చర్చలు

by Ramesh Naini |

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు సమావేశం అయ్యారు.

అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి..? ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీశ్‌రావు కీలక చర్చలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)తో మాజీ మంత్రి హరీశ్‌రావు సమావేశం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో గులాబీ బాస్‌తో హరీశ్‌రావు (Harish Rao) భేటీ అయ్యారు. రేపటి నుంచి (TG Assembly Sessions) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. దానిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ చర్చల అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న సాయంత్రం నుంచి హరీశ్ రావు ఫామ్‌హౌస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో పార్టీ సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ సారి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా?

అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను పెట్టడానికి ముందే తమకు నివేదిక ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. అయితే ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఎప్పటిలానే దూరంగానే ఉంటారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ గులాబీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారని అధికార పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Next Story