- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం తన చిల్లర బుద్ధిని ప్రదర్శించాడు: మాజీ మంత్రి హరీష్ రావు
మంగళవారం సాయంత్రం తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఆవరణలో రైతు భరోసా(Rythu Bharosa) విజయోత్సవ సభ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం సాయంత్రం తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం (Rajiv Gandhi statue) ఆవరణలో రైతు భరోసా(Rythu Bharosa) విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం(Agriculture) దండగ అనే పరిస్థితి నుంచి పండుగ అనే స్థితికి తీసుకొచ్చామని అన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుట్రలతోనే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. సీమాంధ్ర పాలకులతో కలిసి తెలంగాణను ఎడారి చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాను ఏనాడూ రాజీపడబోనని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ రావు తన ట్వీట్‌లో "సచివాలయం ముందు సీఎం రేవంత్ తన సంకుచిత మనస్తత్వాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. ప్రభుత్వ కార్యక్రమం అని మరచి ప్రత్యేక రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు. తెలంగాణకు శనిలా, శాపంగా మారిన రేవంత్ రెడ్డి 'ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే''అనే రీతిలో పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారు. ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక ,ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఎటూ పాలుపోక నిరాశ నిస్పృహలతో పాలనలో కూడా ప్రతి రోజూ అబద్దాలతో, బూతులతో నెట్టుకోస్తానంటే కుదరదు రేవంత్ రెడ్డి అని రాసుకొచ్చాడు.






