Harish Rao : హరీష్ రావుకు తీవ్ర అస్వస్థత

by Muthe.Rajitha |   (  Updated:2025-06-16 15:10:18  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Harish Rao : హరీష్ రావుకు తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కాగా నేడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు(Formula E Racing Case)లో బీఆర్ఎస్ నేత కేటీఆర్(ktr) ఏసీబీ ఎదుట హాజరయ్యారు. అనంతరం కేటీఆర్, ముఖ్యనేత హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. అయితే అప్పటికే హరీష్ రావు హై ఫీవర్ తో బాధపడుతుండగా.. సమావేశంలో చాలాసేపు నిలబడి ఉండటం వలన ఆయన మరింత అస్వస్థతకు గురయ్యారు.

కాగా హుటాహుటిన ఆయనను కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హరీష్ రావు అనారోగ్య సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీగా ఆ పార్టీ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.

Next Story