- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.15 వేలకు ఎప్పుడు పెంచుతారో చెప్పండి-హరీష్‌రావు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన ఆయన, క్షేత్రస్థాయిలో గ్యారంటీల అమలు తీరుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. "భట్టి విక్రమార్క మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా రాష్ట్ర పరిస్థితి ఉంది" అంటూ ఎద్దేవా చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదని ఆరోపించారు. వేలాది మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ వర్తించలేదని, రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు.
రైతు భరోసా ఎక్కడ...?
గతంలో కరోనా వంటి కష్టకాలంలో కూడా తాము (బీఆర్ఎస్) రైతుబంధును నిరంతరాయంగా ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా ఇస్తోందని, ఒక్క పంటకు కూడా సరిగ్గా పెట్టుబడి సాయం అందడం లేదని విమర్శించారు. రైతు భరోసాను రూ. 15 వేలకు ఎప్పుడు పెంచుతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు ఇస్తామన్న బోనస్ హామీ కేవలం 'బోగస్'గా మిగిలిపోయిందని, అటు రైతు కూలీలను కూడా ప్రభుత్వం దగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల అన్నదాతలు అయోమయంలో ఉన్నారని, ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మంత్రి జూపల్లికి కౌంటర్..
‘2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.46,941 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుందని చెప్పారు. గత సంవత్సరం కంటే దాదాపు 12 వేల కోట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని అంటున్నారు. అంత ఆదాయం రావాలంటే 25వేల కోట్లు మద్యం అమ్మాలి. ఏకంగా 35% ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్తున్నారంటే, గల్లీకొక బెల్టు షాపు పెడతారా?’ అని మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు.






