HARISH RAO: నేడు తెలంగాణ భవన్ కు హరీష్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ముందు వారితో భేటీ

by Ajay Maddhiboyina |

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో నేడు ఉద‌యం 11గంట‌ల‌కు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో విచార‌ణ‌కు హ‌రీష్ రావు హాజ‌రుకానున్నారు.

HARISH RAO: నేడు తెలంగాణ భవన్ కు హరీష్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ముందు వారితో భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో నేడు ఉద‌యం 11గంట‌ల‌కు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో విచార‌ణ‌కు హ‌రీష్ రావు హాజ‌రుకానున్నారు. అయితే విచార‌ణ‌కు ముందు ఆయ‌న ఉద‌యం 9గంట‌ల‌కు తెలంగాణ భ‌వ‌న్ కు వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. తెలంగాణ భ‌వ‌న్ లో కేటీఆర్, ఎమ్మెల్యేల‌తో హ‌రీష్ రావు స‌మావేశం కానున్నారు. అనంత‌రం నేరుగా అక్క‌డ నుండి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కి వెళ‌తారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్‌లో హరీష్ రావు పాత్రపై ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిట్ విచారించిన సంగతి తెలిసిందే. కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. చాలా రోజుల క్రితమే ప్రభాకర్ రావు విచారణ ప్రారభం కాగా అధికారులు కస్టడీకి కోరుతూ పలుమార్లు ప్రశ్నిస్తున్నారు.

Next Story