Harish Rao : పాలన చేతగాక ప్రకృతి మీద నిందలేస్తున్న రేవంత్ రెడ్డి : హరీష్ రావు

by Muthe.Rajitha |   (  Updated:2025-03-09 12:28:34  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.

Harish Rao : పాలన చేతగాక ప్రకృతి మీద నిందలేస్తున్న రేవంత్ రెడ్డి : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) విపక్షంలో ఉన్నప్పుడు మొదలు పెట్టి అధికారంలోకి వచ్చాక కూడా అబద్దాలు మాట్లాడటం మానుకోలేదని విమర్శించారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా.. కాంగ్రెస్ పాలనలో మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు(Interest Free Loans) ఇచ్చామని రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిగిలిన వాటికి 12 శాతం వడ్డీ వేస్తున్నారని ఆరోపించారు.

నిజానికి గత 11 నెలల్లో ఒక్క రూపాయి కూడా మహిళా సంఘాలకు విడుదల చేయలేదని, తమ వద్ద ఆ లెక్కలన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. మరి అలాంటపుడు ఆయన ప్రకటించినవన్నీ అబద్దాలే అని, అబద్దానికి అంగీ లాగు తొడిగితే రేవంత్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సహవాసం వలన భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కూడా విలువలు వదిలేశారని అన్నారు. ఇప్పటికైనా వడ్డీ లేని రుణాలు విడుదల చేసి తమరి చిత్తశుద్ది నిరూపించుకోవాలని అన్నారు. విద్యార్థులకు యూనిఫాం కుట్టినందుకు మహిళలకు ఒక్కో జతకు రూ. 75 ఇస్తున్నామని నిన్నటి సభలో తెలిపారని, నిజానికి ఒక్క మహిళకు కూడా కనీసం ఒక్క జత బట్టల కూలి ఇవ్వలేదని మండిపడ్డారు.

తాము అధికారమంలో ఉన్నపుడు 10 ఏళ్లలో రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని.. భట్టి గారు బ్యాంకుల్లో వివరాలు తెలుసుకోవాలని, నిజాయితీగా మాట్లాడాలని హితవు పలికారు. ఎండలకు పంటలు ఎండుతున్నాయని రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన తెలివి తక్కువతనం అన్నారు. వర్షాలు బాగానే కురిసినప్పటికీ.. అన్ని ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉన్నప్పటికీ.. ఆ నీళ్ళను ఏపీకి విడిచిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల మీద రేవంత్ రెడ్డికి సోయి లేదని, నేడు ఒక్క వరంగల్ లోనే లక్ష ఎకరాల పంట ఎండుతుంటే.. దేవాదుల(Devadula Project) నీటిని ఎందుకు వినియోగించుకోలేదని నిలదీశారు. తక్షణమే ఆ రైతులకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేలు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Next Story