Harish Rao : క్షతగాత్రులను పరామర్శించే తీరిక లేదా? : హరీష్ రావు ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-30 12:43:50  IST  )

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్‌ పేలిన(Reactor Exploded) ప్రమాదంలో 14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Harish Rao : క్షతగాత్రులను పరామర్శించే తీరిక లేదా? : హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్‌ పేలిన(Reactor Exploded) ప్రమాదంలో 14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) ప్రమాద స్థలాన్ని పరిశలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.

"పొరుగు రాష్ట్ర మీడియా సంస్థకు ఏదో అయ్యిందని.. డిప్యూటీ సీఎంతో సహా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు... క్షణాల్లో అక్కడ వాలిపోయారని, ఇవాళ పాశమైలారంలో ప్రమాదం జరిగి అమాయక కార్మికుల ప్రాణాలు పోయి.. ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియక మరికొందరు కార్మికుల కుటుంబాలు కన్నీరు పండుతోంటే.. ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతోంటే... అధికార పార్టీ నుంచి ఏ ఒక్కరు అటువైపు పోలేదు. అంటే బడాబాబులు ముఖ్యం కానీ.. పేద కార్మికులను సర్కారు పట్టించుకోదా..?" అని మండిపడ్డారు. ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు ఇంత ప్రమాదం గురించి సమాచారం ఇంకా అందలేదా అని ఎద్దేవా చేశారు. గాయపడిన వారిని కార్పొరేట్ ఆసుపత్రులకు ఎందుకు తరలించ లేదని, వారికి మెరుగైన వైద్యం ఎందుకు అందించలేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన హరీష్ రావు, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Next Story
null