Harish Rao : ముమ్మాటికీ బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం : హరీష్ రావు

by Muthe.Rajitha |

బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) మధ్య చీకటి ఒప్పందం ముమ్మాటికీ నిజమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు.

Harish Rao : ముమ్మాటికీ బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) మధ్య చీకటి ఒప్పందం ముమ్మాటికీ నిజమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి(Jeevan Reddy) చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5నుంచి 10లక్షల వరకు ఇస్తామని హామి ఇచ్చి, రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి(Chinnareddy) బట్టబయలు చేసిన విషయం నిజం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈడీ(ED)లు, సీబీఐ(CBI)లు, ఐటీ(IT)లు, ఎన్నికల్ కమిషన్లు(EC) ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదని, సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన కేసులు పెట్టటంలో చూపించే అత్యుత్సాహం ఆధారాలున్నా, స్వయంగా క్యాబినెట్ ర్యాంకులో ఉండి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడే చెబుతున్నా ఎందుకు పెట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా అని, రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని.. బిజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.

Next Story