Harish Rao: కాగ్ రిపోర్టు ప్రభుత్వానికి చెంపపెట్టు

by Gantepaka Srikanth |

కాళేశ్వరం సహా తెలంగాణ నీటి పారుదల వ్యవస్థపై కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం శుద్ధ తప్పు అని కాగ్ నివేదిక తేల్చి చెప్పిందని.. మిషన్ భగీరథపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని పటాపంచలు చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.

Harish Rao: కాగ్ రిపోర్టు ప్రభుత్వానికి చెంపపెట్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం సహా తెలంగాణ నీటి పారుదల వ్యవస్థపై కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం శుద్ధ తప్పు అని కాగ్ నివేదిక తేల్చి చెప్పిందని.. మిషన్ భగీరథపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని పటాపంచలు చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన ఎకనమిక్ సర్వే 2024-25 నివేదిక బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి సమాధానమని పేర్కొన్నారు. కేంద్రం వెల్లడించిన ఆర్థిక సర్వే రిపోర్టుపై హరీశ్‌రావు స్పందించారు.100 శాతం రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని తెలిపారు. 88 శాతం సొంత పన్నుల రాబడుల్లో అగ్రస్థానంలో రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు.

ఐటీలో తెలంగాణ మేటి అని మరోసారి తేల్చిచెప్పిన ఎకనిమిక్ సర్వే.. కర్ణాటకతోపాటు తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని వెల్లడించినట్లు పేర్కొన్నారు. అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వి హబ్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక, ఐటీ, నీటి పారుదల, మహిళా సాధికారతలో సాధించిన ఘనతను ఆర్థిక సర్వే లెక్కలతో సహా వివరించిందని స్పష్టం చేశారు. ఎకనమిక్ సర్వే రిపోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి బోగస్ ప్రచారమని అని పేర్కొనట్లు తెలిపారు.

రైతులు, చేనేత కార్మికులు.. ఇప్పుడు బిల్డర్లు

బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్‌లో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయమని హరీశ్‌రావు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలో బిల్డర్ సూసైడ్ చేసుకోవడంపై హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలిపారు. అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం.. మూసి, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు చేయడం.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడం.. భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు చేయడం వంటివి కారణంగా నిలిచాయని తెలిపారు. కొత్త పెట్టుబడులు రాకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంపై పెను ప్రభావాన్ని చూపాయని పేర్కొన్నారు.

Next Story