- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌వి మాటలే! ఆ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు లేవు.. హారీష్ రావు
by Ramesh Naini |
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నదని, కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న ఐసీటీ కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. దీంతో వారు అప్పుల పాలయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు.
Next Story






