- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్కడికక్కడ నిలదీయండి: హరీష్ రావు పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) ముఖ్య నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) ముఖ్య నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆందోల్‌లో హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నిక(Local Elections)ల్లో ఓట్లు అడగటానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. కనీసం యూరియా కూడా సరిగా సరఫరా చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో స్థానిక ఎన్నికల్లో అందరికీ తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయింది, ఉన్నది ఇంకా రెండేళ్లు మాత్రమే.. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.






