అందాల పోటీలు ఎవ‌రి క‌డుపు నింపుతాయి... హరీష్ రావు ఫైర్

by Ajay Maddhiboyina |

అందాల పోటీలు ఎవ‌రి క‌డుపు నింపుతాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విత్త‌నాలు, చేప‌పిల్ల‌లు పంపిణీ చేయ‌డానికి ప్ర‌భుత్వం దగ్గ‌ర పైస‌ల్లేవ్ కానీ అందాల పోటీల కోసం

అందాల పోటీలు ఎవ‌రి క‌డుపు నింపుతాయి... హరీష్ రావు ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: అందాల పోటీలు ఎవ‌రి క‌డుపు నింపుతాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విత్త‌నాలు, చేప‌పిల్ల‌లు పంపిణీ చేయ‌డానికి ప్ర‌భుత్వం దగ్గ‌ర పైస‌ల్లేవ్ కానీ అందాల పోటీల కోసం రూ.200 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని అన్నారు. అందాల పోటీల‌తో వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమిటో సీఎం చెప్పాల‌ని అన్నారు. చేప‌పిల్ల‌ల‌కు తిప్పికొడితే రూ.100 కోట్లు అవుతాయ‌న్నారు. రైతు బంధు ఇవ్వ‌మ‌న్నా, రుణ‌మాఫీ చేయాలన్నా పైస‌ల్లేవు అంటున్నాడ‌ని కానీ ఫోర్త్ సీటీ అంటూ రూ.4వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. క‌మీష‌న్ల కోసం, ఢిల్లీకి క‌ప్పం కట్ట‌డానికి ల‌క్ష కోట్లు వ‌స్తున్నాయ‌ని అన్నారు. రేవంత్ వేల కోట్లు టెండ‌ర్లు పిలుస్తున్నార‌ని ఆ వేల కోట్లు ఎవ‌రి జేబులు నింపుతాయ‌ని ప్ర‌శ్నించారు.

Next Story