- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజం ఒప్పుకున్న శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు: హరీష్ రావు
నిజం ఒప్పుకున్న శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు: హరీష్ రావు

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చేస్తున్న ల్యాండ్ స్కాం గురించి కేటీఆర్ చెప్పిన మాటలు నిజమని ఒప్పుకున్నందుకు మంత్రి శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల విలువైన 9298 ఎకరాల భూమిని కేవలం రూ.4 వేల – 5 వేల కోట్లకు అమ్మేయాలని చూస్తున్నాడు.. అంటే మిగతా రూ.4 లక్షల 95 వేల కోట్లు స్కాం చేయాలని చూస్తున్నారు.. శ్రీధర్ బాబు నిన్న అవి 4740 ఎకరాలు మాత్రమే అని అబద్ధాలు చెప్తున్నాడు.. అందుకే నేను శ్రీధర్ బాబుకు సవాల్ చేస్తున్నా.. అవి 9298 ఎకరాల భూములు అని నేను నిరూపిస్తా.. బహిరంగ చర్చకు సిద్ధమా? అని అడిగారు.
ఈ పారిశ్రామిక భూములకు వారం రోజుల్లోనే అధికారులు అనుమతి ఇవ్వాలట.. అనుమతి ఇచ్చిన 45 రోజుల్లోనే డబ్బులు కట్టాలట .. అంటే రెండు నెలల్లోనే ఆ భూములను అమ్మేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు నెలల్లోనే రూ.5 లక్షల కోట్ల స్కాం ఖతం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లాపూర్‌లో 240 ఎకరాల భూమి, TGIIC ప్రకారం రూ.36,827 ఉండగా SRO ధర ప్రకారం కేవలం రూ.17,581 మాత్రమే ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఉప్పల్‌లో 447 ఎకరాల భూమి TGIIC ప్రకారం రూ.52,523 ఉండగా, సబ్ రిజిస్ట్రేషన్ విలువ రూ.21,886 లో కూడా 30 శాతానికి ఎందుకు అమ్ముతున్నారు? అని అడిగారు. గాంధీనగర్‌లో ఉన్న భూములు TGIIC ప్రకారం రూ.46,895 ఉండగా, సబ్ రిజిస్ట్రేషన్ విలువ రూ.14,591 కే అమ్ముతున్నారు.. హయాత్నగర్‌లో భూములకు TGIIC ప్రకారం రూ.54,340 ఉండగా, సబ్ రిజిస్ట్రేషన్ విలువ రూ.14,591కే అమ్ముతున్నారు TGIIC ధర కాకుండా, తక్కువ ఉన్న SRO ధరకు ఎందుకు భూములు అమ్ముతున్నారని హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
అది ఇండస్ట్రియల్ లాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ కాదని.. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ అని విమర్శించారు. 6 నెలల క్రితమే ఈ పాలసీ రూపొందించి రేవంత్ బ్రదర్స్ భూములను ఇప్పటికే ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో 30% టాక్స్ మాత్రమే కాదు దాంతో పాటు RR టాక్స్ కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటాము.. ఈ కొత్త భూముల పాలసీపై శాసనసభ సమావేశాలు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.






