- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళిత మహిళపై వేధింపుల కేసు.. సీఐపై లిఖిత పూర్వక ఫిర్యాదు
by Geesa Chandu |
దొంగతనం కేసులో పోలీసులు సునీత అనే దళిత మహిళను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ జరిపారనే ఆరోపణల ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: దొంగతనం కేసులో పోలీసులు సునీత అనే దళిత మహిళను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ జరిపారనే ఆరోపణల ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సునీత తనపై థర్డ్ డిగ్రీ జరిగినట్లు ఆదివారం ఆగస్టు 11 న షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో డిటెక్టివ్ సీఐ రాంరెడ్డి, కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా సంఘటన జరిగిన 18 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కంప్లైంట్ చేయడం గమనార్హం. తనను పోలీసులు బాగా కొట్టారని, ఆందువల్ల ఇన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందానని, అందుకే ఫిర్యాదుకు ఆలస్యం అయినట్లు బాధిత మహిళ తెలిపారు.
Next Story






