తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో చేనేత శాలువా..

by Gantepaka Srikanth |

తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో చేనేత శాలువా..

తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో చేనేత శాలువా..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ క్యూఆర్ కోడ్‌(Telangana QR Code)తో రూపొందించిన చేనేత శాలువాను నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్‌తో.. పోగు బంధంతో ఫోన్ బంధం ఏర్పడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను తెలిపే ఈ శాలువాను నేసిన సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ కుమార్ రూపొందించారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ కట్టడాలు సంప్రదాయాలు, కేసీఆర్ ప్రభుత్వ సమయంలో చేసిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు తెలిసేలా రూపొందించారు. ఈ సందర్భంగా నల్ల విజయ్‌ను కేటీఆర్ అభినందించారు. కేటీఆర్ వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జనరల్ సెక్రటరీ రావు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్, సీనియర్ నేత జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ పాలనలో పదేండ్లపాటు ప్రగతి పథంలో సాగిన పల్లెల్లో రెండేండ్లుగా పాలనపడకేసిందని అంతకుముందు కేటీఆర్‌ విమర్శించారు. పంచాయతీలను పట్టించుకొనే నాథుల్లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్‌ పాలనలో పారిశుధ్యం గాడి తప్పింది’ అంటూ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్‌ పతనం సమీప భవిష్యత్తులో పాతాళానికి పడిపోవడం ఖాయమని చెప్పారు. వీడియో

Next Story