- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana:టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..!
తెలంగాణ(Telangana)లోని పదో తరగతి(10th Class) విద్యార్థుల(Students)కు గుడ్‌న్యూస్.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లోని పదో తరగతి(10th Class) విద్యార్థుల(Students)కు గుడ్‌న్యూస్. ఈ ఏడాది(2025) పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈరోజు(మార్చి 7) నుంచి తమ హాల్ టికెట్లు(Hall Tickets) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల(మార్చి) 21వ తేదీ నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను నేడు పాఠశాల విద్యాశాఖ(School Education Department) అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరీక్షలు మార్చి 21న ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆయా పరీక్ష తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే.. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. అధికారిక https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తమ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 11,544 పాఠశాలల నుంచి 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.






