- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులపై BIG అప్డేట్
తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యుడు చిటపటలాడుతూ 40 డిగ్రీల టెంపరేచర్ క్రాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ (Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వ తేదీ వరకు ఒంటిపూట బడులు (Half-Day Schools) నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు పని చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు, పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరుక పని చేస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని డీఈవోలను ఆదేశించారు.






